Monday, August 31, 2009

ఒక రోజు

తెల్లవారుఝామున మల్లేతీగలా నిదురలేచిన నేను
"అరే! అపుడే తెల్లారిందా" అని కళ్ళుతెరిచి చూసేసరికి,
ఆ పక్కగా వున్న కిటికీలోంచి నిశీధి సూర్యుడిని చూచి ,ఒల్లువిరుచుకుని,
పల్లకీలోంచి దిగే రాకుమారిలా మంచంమీంచి దిగి,వరండాలోకి వెళ్ళేసరికి,
"ఒసేవ్,ఇంత పోద్దేక్కేదాకా ఆ మొద్దునిద్రేమిటే?"అంటూ మా బామ్మ పూజామందిరం వైపు వెళ్ళిపోయింది.
ఆ కార్యక్రమం కాస్తా కానిచ్చాక, రోజూలానే నిదురలేచిన సూర్యుడు
మబ్బులనే పరదాలమాటునుండి బయటకువచ్చి,నన్ను చూసి కన్ను గీటగా ,
ఆ నులువేచ్చని కిరణాల తాకిడికి,
హేమంతపు 'చలికాడు' "మరల సంద్యవేళ కలుస్తా" అంటూ నన్ను వీడి పోయాడు.
ఈలోగా "నీళ్లు మరిగిపోతున్నాయి.త్వరగా స్నానానికి వెళ్ళు"అంటూ అమ్మ కేకలేసింది.
పరుగు పరుగున వెళ్ళి పని పూర్తి చేసుకు వచ్చా.

పెరట్లోకి అడుగుపెట్టగానే చల్లని పిల్లగాలి నా నేస్తాల కులాసాను తెలియజేసింది.
అలా.....ముందు ముద్దమందారం దగ్గరకు వెళ్ళగానే
"అవునూ, నువ్వు ముద్దా నేను ముద్దా?"అని చిలిపి ప్రశ్న వేసింది.
దాన్ని సుతారంగా తాకుతూ "సర్లే ,ఈరోజుకు నువ్వే ముద్దు" అంటూ కొంటెగా సమాధానం చెప్పి,
మల్లే పందిరివైపు నడుస్తూవుంటే ,
నా పరికిణీ లాగి "నేస్తమా,నన్ను పలకరించవా?" అంటూ అలిగింది గులాబి.
పరికిణీని గులాబిముళ్ళనుండి సున్నితంగా తీస్తూ
"నా చెక్కిలిపై మక్కువగా తాకల్సిన నీవు,ఇలా పరికిణి లాగడం బావుందా?" అంటూ పెదవివిరిచాను.
"క్షమించవే!" అంటూ తన సుగంధాన్నినింపుకున్న ఒక మంచుబిందువును నా పెదవిపై జార్చింది.
"నువ్విచింది నీదగ్గరే ఉంచుకో" అంటూ నా మధుర ఆధారాలతో తన రేఖల్ని సుతారంగా తాకాను.
సిగ్గుతో ముడుచుకుపోయింది.
నేతిరిగి వెడుతుంటే, జాలిగా చూసిన నా చెలి రోజాను, సున్నితంగ తలలో తురుముకున్నా.
అటుగా వెళుతున్న నన్ను, మల్లే "నన్నల్లుకోవా" అంటూ పిలిచింది.
"నీతో పని సాయంత్రం కదా!" అని కన్నుగీటి వెళ్ళిపోయాను.

ఆ నిటలాక్షుని పదకమలాలను అర్చించి వెలుపలకు రాగానే, అమ్మ ఫలహారం అందించింది.
ఈలోగా, తోటలోని పరువంలో ఉన్నజామకాయలు,పక్వానికి వచ్చిన ఉసిరికాయలు,
నిన్న నానోరూరించిన వైనం గుర్తుకువచ్చింది.
వెంటనే అటుగా పోతున్న తుమ్మెదను తొడుతీసుకొని తోటదారి పట్టా!

తోటలోకి అడుగిడగానే పచ్చని పచ్చివాసనకి,
నా జిహ్వ మత్తులోకి జారి , రసస్పందనతో లావణ్య జలాలను వెలువరించింది.

నిండుమబ్బులో ఎన్ని చినుకులు ఉంటాయో ఎలా లేక్కించలేమో,
ఆకాశంలో వ్రేల్లాడే నక్షత్రాల్లా ఉన్న ఆ ఉసిరికాయలను లెక్కించడం నా తరమా! అనిపించింది.

ఆ పక్కనే ఉన్న జామకాయలు "నన్నందుకోగలవా?" అంటూ విర్రవీగాయి.
ఆ సరికే సమరానికి కాలుదువ్వుతున్న నేను,
"సరే,చూస్తావా" అంటూ చక చకా చెట్టెక్కి చిటారుకోమ్మను అందుకోప్రయత్నం చేసాను.
ఆ ప్రయత్నంలో అప్రయత్నంగా కాలుజారిన నా తత్తరపాటును చూసి విరగబడినవ్వింది ఆ జామకాయ.
"ఇక నువ్వో నేనో తేలాలి" అంటూ మరోసారి ప్రయత్నించాను.
అందీఅందనట్టున్న పరిస్తితి. నా చేతికి చిక్కకూడదనే దాని విఫలయత్నం.
చివరికి గేలుపునాదే!
ఒక్క ఉదుటన కిందికి దూకి,పరికిణీతో దాన్ని తుడిచి, కసిగా కొరికాను.
నా పళ్ళగాటుకి బిత్తరపోయింది. ఓటమినోప్పుకుంది.

ఇక, నాజిహ్వనాకర్షించే ఉసిరి మీద పడింది నా కన్ను.
ఆశలనే గులకరాళ్ళతో అమాయకత్వపు ఉసిసికాయల్ని కొట్టాను.
వెంటనే, అదృష్టమనే ఉసిరి వర్షాన్ని నేలను తాకకుండా పరికిణీలో పట్టాను.
మరి, ఆ అదృష్టాన్ని చిదిమి, అత్యాసనే గింజను తీసి పారేసి,
జీవితమనే అమాయకపు ఉసిరిని ఆస్వాదించాను.
{ఇంకా ఉంది}

5 comments:

  1. మీ వర్ణన బాగుంది. కొంచం చమత్కారం, కొంచం రొమాన్స్ కలిపేసరికి చక్కగా పండింది.
    >>"నువ్విచింది నీదగ్గరే ఉంచుకో" అంటూ నా మధుర ఆధారాలతో తన రేఖల్ని సుతారంగా తాకాను.సిగ్గుతో ముడుచుకుపోయింది.
    ఇలా తిరిగి ఇవ్వడం బావుంది.

    >>అటుగా వెళుతున్న నన్ను, మల్లే "నన్నల్లుకోవా" అంటూ పిలిచింది.
    "నీతో పని సాయంత్రం కదా!" అని కన్నుగీటి వెళ్ళిపోయాను.
    మల్లె 'యు నాటీ!..' అంటూ సిగ్గుపడి ఉంటుంది.

    ReplyDelete
  2. naa paalee ki todainanduku krutagnyatalu muraarigaaru.

    ReplyDelete
  3. మనసున తొడిగే ఆశల ఉషా కిరణాలు...
    ముంగిట్లోన విరిసే ముద్దొచ్చే మందారాలు...
    సుగంద మధువు కురిసే గులభిలు....
    అలిసిన మనసు సేద తీర్చే సిరి మల్లెలు...
    జగడానికి కాలుదువ్విన జామకాయలు...
    నీ జిహ్వ తీర్చి అత్యసను హరించిన ఉసిరి కాయలు...
    ఈ ప్రక్రుతి అంతా నీ కావ్యలతో శోబిల్లే
    సొభానాలేనమ్మ....కల్పలతికమా....

    ReplyDelete