Sunday, October 4, 2009

ఓచిన్ని ఆశ !!

ఏమిటీ ఆలోచన? ఎప్పటిదీ నిష్యబ్దం?
ఎందుకీ ఆవేదన? ఎక్కడిదీ ఆక్రోశం?

ప్రేమే వీటికి అంకురార్పణ చేసిందా?
లేక ప్రేమున్న చోటకు ఇవి చొచ్చుకు వస్తాయా?

నా నిష్యబ్దపు ఆలోచనల్ని ఆవేదనే ఆక్రోశంగా చీల్చుకు వచ్చింది.

ఈ వేదనకి మూలం ఆవేదనా?
మరి ఈ ఆవేదనకీ మూలం.......?

వెలకట్టలేని అమూల్యమైన ఆ "మూలం"
ఏమూల నుండో ఈ మూల చూస్తూ వుంటుందనే "ఆశ" ఏమూలోవుంది.

అందుకే....
కన్నీరు ప్రవాహమౌతున్నా, ఆ ఉధృతిలో మునిగిపోకుండా
"ఆశ" అనే తెరచాపను పరిచాను.
ఈ స్థితికి ఉషోదయం ఉందోలేదో ప్రస్తుతం తెలియదుకానీ,
పరిస్థితిననుసరించాననే ఆత్మసంతృప్తిని మాత్రం మిగుల్చుకున్నాను.

6 comments:

  1. aa mulam yemulanundo naku telusu, nee mulaki eppudu vastundo kuda telusu. nee "asha" tvaralone neraverutundile....!!

    ReplyDelete
  2. మాట రాక తడబడే నీ ముందర ఆ క్షణాలు
    నిజంగా నీ మాటలు అక్షర లక్షలు
    నీ ముందుకు రాలేని, చెప్పలేని ఆవేదనలు
    నిను వీడలేక వెల్లలేని ఆ తీయని బాధలు
    మరి వీటన్నిటికి మూలాలు నా మదిలోని నీ భావాలు
    నీ హ్రుదయాన దాగుండాలని కలుగుతున్నాయి నాలో ఆశలు !

    ReplyDelete
  3. asha anedi unte chalu anni ee mula ayina vastundi ni daggaraku...dont loose hope...na nestama...

    ReplyDelete
  4. chaala bagaa rasarandi manasulo cheppalenibayatiki rani bavaalani...


    www.tholiadugu.blogspot.com

    ReplyDelete
  5. @Kartik Gaaru..thank u very much...

    ReplyDelete