Sunday, October 4, 2009

ఎవరీమె?

కన్నులు తెరిచి చూచేసరికి ఎదురుగా సాత్షాత్కరించిందీ ఓ ముగ్ధ మనోహర సౌందర్య రాశి.
నా ఈ లౌకిక చక్షువులకు ఆమెను మొత్తంగా చూసే శక్తి లేదు.

ఏర్రని సూర్యుడే ఆమెకు సింధూరమై మెరవగా,
ఇంద్రధనసులే ఆమె కనుబోమలై తీరగా,
కలువ రేఖలే వెలుగురేఖల కనులుగా,
కారుణ్యపు చీకటులే కాటుకై దిద్దగా ,
సంపంగుల సందడులే నాసికమవగా,
వెండివెన్నెలల నెలరాజే ముక్కెర కాగా,
పూరేఖలు పొదివిన మధువులే పేదవులవగా,
జల జల రాలే జలపాతాలే జూకాలవగా,
సహస్ర శంఖానాద రూపమే గ్రీవముగా,
విశృంఖ హిమపర్వతములే వక్షముగా,
గగన వీధులే మేని మధ్యమముగా,
పలువరసల పాలపుంత మారి నాభికాగా,
చతుషష్టి కళలే జంఘములవగా,
అలల అలజడులే ఊరువులవగా,
ఖగోళాల కదలికలే సిరిమువ్వలు కాగ,
త్రికాల పడగతులే పాదములవగా,
ప్రేమాక్షర నక్షత్రాలే హారమవగా,
వసంతపు మధురవాణియే వేణియ కాగా,
జనన మరణాల జాతులే జడకుప్పెలుగా,
కాలనిర్మిత భవబంధాలే గాజులుగా,
పచ్చదనపు పచ్చికపై పసిడిపూలు నేసిన చీరను కట్టగా,
రవలించే మురళి గానం రవిగాంచని రవిక కాగా,

ఆమెను చూచిన నా కర్మ చక్షువులు,నిష్కామకర్మోపాసనకై చూడగా,
ఆమె ఓ కదిలే విద్యుల్లతై అంతర్దానమయ్యింది.

2 comments:

  1. మీరు వర్ణించిన ముగ్ద మనోహరి మరి చక్షువులకు కానవచ్చుతఎమో కానీ నా ఊహ కు సైతం చిక్క లేదు,
    ఇంతకీ ఏమిటది? నీలో ఆలోచనలకి రంగు అద్దగా రూపమోచ్చిన చిత్రమా? లేక ఉలి దెబ్బలు తలగని శిల్పి చెక్కిన శిలా రూపమా?

    ReplyDelete
  2. uli debbalaku saitam veravakunda tanani tane maluchukune shilpam lanti aa strimurthi...

    ReplyDelete